80 కోట్ల మంది పేదలకు కేంద్రం శుభవార్త!

ABN , First Publish Date - 2021-04-23T22:06:18+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి విసురుతున్న సవాళ్లతో ఇబ్బందులు అనుభవిస్తున్న పేదలకు

80 కోట్ల మంది పేదలకు కేంద్రం శుభవార్త!

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి విసురుతున్న సవాళ్లతో ఇబ్బందులు అనుభవిస్తున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులను అందించబోతోంది. మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను పేదలకు అందజేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం క్రింద ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తారు. 


భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచితంగా 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాలను అందజేస్తారు. కోవిడ్-19 మహమ్మారి విలయం నేపథ్యంలో అమలు చేయబోయే ఈ పథకం కోసం సుమారు రూ.26 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. 


ఇదిలావుండగా, శుక్రవారం ఉదయం 8 గంటలకు పూర్వం గడచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. 


కోవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో చాలా రాష్ట్రాల్లో స్థానికంగా ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో అనేక మంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. 



Updated Date - 2021-04-23T22:06:18+05:30 IST