కాశ్మీరీ పండిట్లపై కేంద్రం రిపోర్ట్.. ఎన్ని కుటుంబాలు వలస వెళ్లాయంటే..

ABN , First Publish Date - 2022-04-27T03:02:49+05:30 IST

న్యూఢిల్లీ : పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా 1990వ దశకం ఆరంభంలో 64,827 కాశ్మీరీ పండిట్ కుటుంబాలు కాశ్మీర్‌ లోయను వీడి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లాయని

కాశ్మీరీ పండిట్లపై కేంద్రం రిపోర్ట్.. ఎన్ని కుటుంబాలు వలస వెళ్లాయంటే..

న్యూఢిల్లీ : పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా 1990వ దశకం ఆరంభంలో 64,827 కాశ్మీరీ పండిట్ కుటుంబాలు కాశ్మీర్‌ లోయను వీడి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కుటుంబాలు జమ్మూ, ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డాయని కేంద్ర హోంశాఖ రిపోర్ట్ పేర్కొంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ వార్షిక రిపోర్ట్ 2020-21 ప్రకారం.. 1990 దశకంలో జమ్ముకాశ్మీర్‌లో మిలిటెంట్ దాడుల కారణంగా 14,091 పౌరులు, 5,356 మంది భద్రతా బలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.


మిలిటెన్సీ కారణంగా కేవలం కాశ్మీరీ పండిట్లు మాత్రమే కాకుండా కొంతమంది సిక్కులు, ముస్లీం కుటుంబాలు కూడా కాశ్మీర్ లోయ నుంచి ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస తరలివెళ్లాయి. జమ్ములోని పర్వతప్రాంతం నుంచి దాదాపు 1054 కుటుంబాలు జమ్మూలోని మైదాన ప్రాంతాలకు తరలివెళ్లాయి. జమ్ముకాశ్మీర్ రిలీఫ్ అండ్ మైగ్రెంట్ కమిషనర్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. జమ్ములో 43,618 కాశ్మీరీ వలస కుటుంబాలు స్థిరపడ్డాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో 19,338 కుటుంబాలు, రాష్ట్రాలతోపాటు ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1995 కుటుంబాలు స్థిరపడ్డాయని రిపోర్ట్ చెబుతోంది. కాగా జమ్ముకాశ్మీర్‌లో 1990 దశకంలో తొలిసారి మిలిటెన్సీ వెలుగుచూసింది. సరిహద్దుల్లో చొరబాట్లతో ముడిపడివుండడంతో జమ్ముకాశ్మీర్‌లో మిలిటెన్సీ చాలా జఠిలమైనదని రిపోర్ట్ పేర్కొంది.

Updated Date - 2022-04-27T03:02:49+05:30 IST