అయోధ్య రామ భక్తులకు మరొక సదుపాయం : కేంద్ర మంత్రి

Published: Tue, 09 Mar 2021 17:44:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అయోధ్య రామ భక్తులకు మరొక సదుపాయం : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో అత్యాధునిక విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. దీనికోసం రూ.242 కోట్లు మంజూరయ్యాయి. ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే శ్రీరాముని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు చాలా సదుపాయంగా ఉంటుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి మంగళవారం ఈ వివరాలు తెలిపారు. 


హర్‌దీప్ సింగ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, శ్రీరాముని జన్మభూమి అయోధ్యకు పౌర విమానయానం అనుసంధానంపై శుభవార్త చెప్తున్నానన్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయోధ్యలో అత్యాధునిక విమానాశ్రయం నిర్మాణం కోసం రూ.242 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ విమానాశ్రయం భక్తులకు, సందర్శకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు చెప్తున్నానన్నారు. తొలి దశ కార్యకలాపాల కోసం సుమారు 270 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు మరొక 558 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.