Kishanreddy fire: ఓటమి భయంతో కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు

ABN , First Publish Date - 2022-08-16T17:20:41+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kishanreddy fire: ఓటమి భయంతో కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ (BJP) కార్యాలయంలో మాజీ ప్రధాని వాజపేయి (Vajpayee) వర్థంతి కార్యక్రమం సందర్భంగా వాజపేయి చిత్రపటానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్‌ (Governor)ను కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కార్‌ను ప్రజలు పాతరేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఓటమి భయంతో సీఎం కేసీఆర్ (KCR) తప్పుల మీద తప్పులు చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. గవర్నర్  (Tamilisai)ఎట్ హోం కార్యక్రమానికి గైర్హాజరై సంప్రదాయాలను కేసీఆర్ మంటగల్పుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించపోవటం రాజ్యాంగ విరుద్ధమన్నారు.


బండి సంజయ్ (Bandi sanjay) పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయటాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. కొడుకు‌ కేటీఆర్ (KTR) ఎప్పటకీ ముఖ్యమంత్రిని కాలేడన్న ఫ్రస్టేషన్‌లో కేసీఆర్ ఉన్నారన్నారు. ప్రధాని మోదీ (PM Modi), కేంద్రానికి కేసీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదని అన్నారు. తన కాళ్ళ కింద భూమి కదలిపోతోందన్న ఆందోళనతో కేసీఆర్ ఉన్నారని తెలిపారు. తెలంగాణ (Telangana)కు ఏం చేశాడని.. కేసీఆర్ దేశాన్ని ఉద్దరిస్తారని ప్రశ్నించారు. ఇంజనీర్ల సూచనలను పక్కనపెట్టి సొంత ఆలోచనతో సాగునీటి ప్రాజక్టులను కేసీఆర్ నిర్మించారని మండిపడ్డారు. బీజేపీలో చేరాలనుకునేవారిపై కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఆరోపించారు. నిరాశ, నిస్పృహతో కేసీఆర్ ప్రభుత్వం భౌతికదాడులు చేయిస్తోందని అన్నారు. సెంటిమెంట్‌తో ముఖ్యమంత్రి కుర్చీలో కేసీఆర్ ఎక్కువ కాలం కూర్చోలేరని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-08-16T17:20:41+05:30 IST