Kishanreddy letter: మూడు నూతన ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2022-07-30T19:21:34+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేందమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.

Kishanreddy letter: మూడు నూతన ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)కు కేందమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో మూడు నూత‌న విమానాశ్ర‌యాల (New Airports) ఏర్పాటుపై లేఖలో ప్రస్తావించారు. ఇప్ప‌టికే కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింథియా(Jyotiraditya Cynthia) రాసిన లేఖ‌ను ఈ సందర్భంగా కేంద్రమంత్రి గుర్తుచేశారు. 


లేఖ‌లో కిష‌న్ రెడ్డి ఏమన్నారంటే...

* వ‌రంగ‌ల్, అదిలాబాద్, జ‌క్రాన్ ప‌ల్లిలో విమానాశ్ర‌యాల ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది 

* సింథియా లేఖ రాసినా ఇప్ప‌టికీ అవ‌స‌రం అయినా రెగ్యులేట‌రీ అనుమ‌తి వంటి ప్రాథ‌మిక అంశాల్లో పురోగ‌తి సాధించ‌క పోవ‌డం విచార‌క‌రం 

* వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యానికి ఏయిర్ పోర్ట్ అథికారిటీ ఆఫ్ ఇండియాకు 748 ఎకరాల స్థ‌లం ఉంది. ఈ విమానాశ్ర‌యం ప్ర‌స్తుతం ఎలాంటి కార్య‌కలాపాలు చేప‌ట్టేందుకు వీలు లేకుండా ఉంది. దీనికి వెంట‌నే మ‌ర‌మ్మ‌త్తులు చేసి ప్రైవేటు విమానాలు రాక‌పోక‌లకు అడ్డంకులు తొల‌గించాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నా. ఈ విమానాశ్ర‌య అభివృద్దికి మొద‌టి ద‌శ‌లో 27.7 ఎక‌రాలు , రెండో ద‌శ‌లో 333.86 ఎక‌రాలు స‌మీక‌రించాల్సి ఉంటుంది. 

* ఆదిలాబాద్ విమానాశ్ర‌యానికి రాక‌పోక‌ల కోసం ర‌న్‌వేకు అప్రోచ్ ప్యానెల్‌కు వంద‌కు పైగా అడ్డంకుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం తొల‌గించాలి. ఆనుకుంట గ్రామానికి అదిలాబాద్‌తో క‌లిపే దారిని మ‌ళ్లించాలి. మొద‌టి ద‌శలో 122, రెండ‌వ ద‌శ‌లో 127 ఎక‌రాల భూమిని స‌మీక‌రించాల్సి ఉంటుంది. 

* జ‌క్రాన్ ప‌ల్లిలో నిర్మించాల్సిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కోసం మొద‌టి ద‌శ‌లో 510, రెండో ద‌శ‌లో 235 ఎక‌రాల భూమి సేకరించాలి. గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టు కావ‌డంతో విమానయాన సంస్థ వాయుసేన అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. 
* మూడు విమానాశ్ర‌యాల‌కు సంభందించి సాంకేతిక , ఆర్థిక ప‌ర‌మైన సాధ్యాసాధ్యాల‌ను నివేదిక‌ను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏడాది క్రిత‌మే రాష్ట్ర ప్ర‌భుత్వంకు అంద‌జేసింది. 
* మూడు విమానాశ్ర‌య ఏర్పాటుకు స‌హ‌క‌రించేందుకు కేంద్రం సిద్దంగా ఉంది. 
* రాష్ట్ర ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నుల‌ను త్వ‌ర‌గా చేస్తే ప్ర‌జ‌ల‌కు మూడు విమానాశ్ర‌యాలు అందుబాటులోకి వ‌స్తాయి. 
* కేసీఆర్ వ్య‌క్తిగ‌తంగా చొర‌వ తీసుకుని ఈ విమానాశ్ర‌యాల‌ను వీలైనంత త్వ‌ర‌గా సిద్ధం చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నా అంటూ కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-30T19:21:34+05:30 IST