KishanReddy: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి విమర్శలు

ABN , First Publish Date - 2022-07-30T16:24:04+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

KishanReddy: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి విమర్శలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan reddy) విమర్శలు గుప్పించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి (CM KCR) ‌ఢిల్లీలో కూర్చోవటం విచారకరమన్నారు. సీఎం కేసీఆర్ నాలుగు రోజులు ఢిల్లీలో ఏమి చేశారో ప్రజలకు తెలియాలని అన్నారు. శనివారం  ఉదయం ముసారంబాగ్ వద్ద మూసీ(Musi) వరదను  కేంద్రమంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పుత్రవాత్సల్యంతో కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేయటం తగదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలాయని... ప్రజలు ఇంకోసారి టీఆర్ఎస్‌(TRS)కు అవకాశం ఇవ్వరని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.


ఎస్డీఆర్ఎఫ్ (SDRF) నిధులపై మంత్రి‌ కేటీఆర్(KTR) అవాస్తవాలు చెప్తున్నారని మండిపడ్డారు. మూసీనది ఆక్రమణలను ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మూసీ ఒడ్డున అక్రమంగా షెడ్డులు వేసి పేదలకు అద్దెకు ఇస్తున్నవారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళలన చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. వరదలతో నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-30T16:24:04+05:30 IST