court order: కేంద్రమంత్రి రాణే రెండు రోజులు పోలీసుస్టేషనులో హాజరుకావాలి

ABN , First Publish Date - 2021-08-25T13:52:08+05:30 IST

కేంద్రమంత్రి నారాయణ్ రాణే కేసులో మహద్ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా కొన్ని షరతులు విధించింది....

court order: కేంద్రమంత్రి రాణే రెండు రోజులు పోలీసుస్టేషనులో హాజరుకావాలి

ముంబై (మహారాష్ట్ర): కేంద్రమంత్రి నారాయణ్ రాణే కేసులో మహద్ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా కొన్ని షరతులు విధించింది. బెయిలుపై విడుదలైన కేంద్రమంత్రి నారాయణ్ రాణే ఈ నెల31, వచ్చే నెల 13వతేదీల్లో రెండు రోజుల పాటు రత్నగిరి పోలీసుస్టేషనులో హాజరుకావాలని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను పోలీసులు మంగళవారం అరెస్టు చేయగా కోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే.


భవిష్యత్ లో రాణే ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని కోర్టు హెచ్చరించింది. కేంద్రమంత్రి రాణేకు బెయిలు మంజూరు చేస్తూ కోర్టు కొన్ని షరతులు పెట్టిందని, ఆగస్టు 31, సెప్టెంబర్ 13 తేదీల్లో రత్నగిరి పోలీస్‌స్టేషన్ ముందు హాజరు కావాలని, ఇలాంటి నేరం భవిష్యత్ లో చేయరాదని సూచించిందని రాణే న్యాయవాది సంగ్రామ్ దేశాయ్ చెప్పారు.మరోవైపు, బీజేపీ నాయకుడు ప్రవీణ్ దారేకర్ గురువారం మహారాష్ట్రలో జన్ ఆశీర్వాద్ యాత్రను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. 15వేల రూపాయల వ్యక్తిగత బాండ్ పై మంత్రి రాణేకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. 


Updated Date - 2021-08-25T13:52:08+05:30 IST