కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్‌ ఎన్‌ఎస్‌టీఎల్‌ సందర్శన

ABN , First Publish Date - 2022-01-23T05:19:16+05:30 IST

కేంద్ర కార్మిక, ఉపాధి, పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి శనివారం ఎన్‌ఎస్‌టీఎల్‌ను సందర్శించారు.

కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్‌ ఎన్‌ఎస్‌టీఎల్‌ సందర్శన
కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న ఎన్‌ఎస్‌టీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు

గోపాలపట్నం, జనవరి 22:  కేంద్ర కార్మిక, ఉపాధి, పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి శనివారం ఎన్‌ఎస్‌టీఎల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌టీఎల్‌ కలాం ప్రేరణా స్థల్‌ ప్రాంగణంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం విగ్రహం వద్ద రామేశ్వర్‌తో పాటు ఎన్‌ఎస్‌టీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.శ్రీనివాసరావు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయనకు ఎన్‌ఎస్‌టీఎల్‌ కార్యకలాపాలను డైరెక్టర్‌ వై.శ్రీనివాసరావు వివరించారు. నీటి అడుగున ఆయుధాలు, హైడ్రోడైనమిక్స్‌, వార్‌ షిప్‌ టెక్నాలజీ రంగాల్లో ఆర్‌ అండ్‌ డీ కార్యకలాపాలను విశదీకరించారు. లిథియం అయాన్‌ బ్యాటరీ సెంటర్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి శాస్త్రవేత్తలను అభినందించారు. శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.శ్రీనివాస్‌ కుమార్‌ తాను అభివృద్ధి చేస్తున్న బ్యాటరీ టెక్నాలజీని వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T05:19:16+05:30 IST