Operation Ganga: నేడు స్వదేశానికి చేరనున్న 3,726 మంది భారత పౌరులు

ABN , First Publish Date - 2022-03-03T23:57:52+05:30 IST

ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో గురువారం 3,726 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి ఇండియాకు బయల్దేరనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా ఓ సమావేశంలో వెల్లడించారు. ప్రధాన

Operation Ganga: నేడు స్వదేశానికి చేరనున్న 3,726 మంది భారత పౌరులు

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో గురువారం 3,726 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి ఇండియాకు బయల్దేరనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా ఓ సమావేశంలో వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిశానిర్దేశంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిండానికి పని చేస్తున్నట్టు పేర్కొన్నారు. 3,726 మంది భారతీయులు గురువారం తమ ఇంటికి చేరుకుంటారని తెలిపారు. బుకారెస్ట్ నుంచి ఎనిమిది విమానాలు, Suceava నుంచి రెండు, Kosice నుంచి ఒకటి, Budapest నుంచి ఐదు విమానాలు, Rzeszow నుంచి మరో మూడు విమానాలు ఏర్పాటు చేసి భారత పౌరులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 



ఉక్రెయిన్- రష్యా మధ్య కొన్ని రోజులుగా భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 20,000 మంది భారత పౌరులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే పదుల సంఖ్యలో విమానాలను ఏర్పాటు చేసి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. 




Updated Date - 2022-03-03T23:57:52+05:30 IST