Union Minister Sobha Karandalje: ఎలాంటి అభివృద్ధి లేదు.. సీఎం కేసీఆర్‌ ఏం చేస్తున్నారు..?

ABN , First Publish Date - 2022-09-15T02:40:03+05:30 IST

తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అయినా ఎలాంటి అభివృద్ధి లేదని..

Union Minister Sobha Karandalje: ఎలాంటి అభివృద్ధి లేదు.. సీఎం కేసీఆర్‌ ఏం చేస్తున్నారు..?

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అయినా ఎలాంటి అభివృద్ధి లేదని.. సీఎం కేసీఆర్ (Cm Kcr) కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని కేంద్ర సహాయ మంత్రి శోభా కరందలజే (Union Minister Sobha karandalje) పర్యటించారు. ఈ సందర్భంగా శోభా కరందలజే మాట్లాడుతూ అర్హులకు పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని, భగవంతుడు కరుణించినా పూజారి ప్రసాదం పెట్టనట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మోదీ అర్హులకు ఇళ్లు మంజూరు చేసినా తెలంగాణలో సీఎం కేసీఆర్ వాటిని కట్టించడం లేదని చెప్పారు. కర్ణాటకలోని ప్రతి గ్రామంలో కేంద్రం నుంచి మంజూరైన ఇళ్లు అర్హులకు దక్కాయన్నారు.


కర్ణాటకలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు దక్కితే.. ఇక్కడ ఎందుకు అర్హులకు ఇళ్లు దక్కలేదని  కేంద్ర సహాయ మంత్రి శోభా కరందలజే ప్రశ్నించారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులను కేటాయిస్తున్నారని..  కనీసం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌కి రాని సీఎం దేశంలోనే ఒకే ఒక్కడు కేసీఆర్ అని విమర్శించారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని.. ఇందుకేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకుందని నిలదీశారు.  తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర సహాయ మంత్రి శోభా కరందలజే తెలిపారు. 

Updated Date - 2022-09-15T02:40:03+05:30 IST