పైకెగిరిన కొద్దిసేటిపకే విమానంలో మంటలు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2021-02-22T15:47:19+05:30 IST

యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో

పైకెగిరిన కొద్దిసేటిపకే విమానంలో మంటలు.. వీడియో వైరల్!

కొలరాడో: యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో తిరిగి అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దీంతో 231 ప్రయాణికులు సహా.. 10 మంది సిబ్బంది పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆ విమానానికి సంబంధించిన.. ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విమానం ఇంజిన్‌లో మంటలు చలరేగిన దృశ్యాలను ఓ ప్రయాణికుడు తన ఫోన్‌లో బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘ఒకానొక సమయంలో మేమంతా చనిపోతామని అనుకున్నాని.. నిజాయితీగా చెప్పగలను. అయితే ఫైలెట్ అప్రమత్తం అయ్యి.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు’ అని పేర్కొన్నారు. కాగా.. ఈ వీడియో పట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 




Updated Date - 2021-02-22T15:47:19+05:30 IST