ఐకమత్యంతో పనిచేస్తే టీడీపికి విజయం : ఉగ్ర

ABN , First Publish Date - 2021-03-02T06:17:01+05:30 IST

కష్టపడి ఐక్యతతో కలిసికట్టుగా పనిచేయడం ద్వారా తలకొండపాడు పంచాయతీ సర్పంచ్‌గా తిరుపమ్మను గెలిపించుకున్నామని మాజీ శాసనసభ్యుడు, కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.

ఐకమత్యంతో పనిచేస్తే టీడీపికి విజయం : ఉగ్ర
కార్యకర్తలతో మాట్లాడుతున్న డాక్టర్‌ ఉగ్ర

పీసీపల్లి, మార్చి 1: కష్టపడి ఐక్యతతో కలిసికట్టుగా పనిచేయడం ద్వారా తలకొండపాడు పంచాయతీ సర్పంచ్‌గా తిరుపమ్మను గెలిపించుకున్నామని మాజీ శాసనసభ్యుడు, కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సోమవారం తలకొండపాడు పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్పంచ్‌ వార్డు సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇదే ఉత్సాహంతో వచ్చే మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కార్యకర్తలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉంటానని, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో పీసీపల్లి మండలాన్ని తన సొంత మండలంగా భావించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. అందులో భాగంగానే పాలేటి పల్లి చెరువును నిర్మించానన్నారు. అలాగే అలవలపాడు వద్ద పాలేరు నదిపై వంతెన నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. మట్టిరోడ్లను సిమెంట్‌ రోడ్లగా మార్చానన్నారు. పీసీపల్లి మండలం టీడీపీకి కంచుకోటని, అటువంటి మండలంలో పార్టీ అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.  ఉగ్రనరసింహారెడ్డి గ్రామానికి రావడంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున  స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తలకొండపాడు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2021-03-02T06:17:01+05:30 IST