శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ

Published: Tue, 18 Jan 2022 00:31:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవప్రత్యేకాలంకారంలో స్వామి, అమ్మవార్లు

శ్రీకాళహస్తి, జనవరి 17: పౌర్ణమి పురస్కరించుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి సోమవారం శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ నిర్వహించారు. తొలుత ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ఊంజల్‌సేవను జరిపించారు. కొవిడ్‌ ఉధ్రుతి దృష్ట్యా ఈ వేడుకలను ఆలయ అధికారులు ఏకాంతంగానే నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.