గర్భనిరోధకానికి వాడే I-Pill ట్యాబ్లెట్ల గురించి చాలా మందికి తెలియని నిజాలివి.. ఆ టైమ్‌లో పొరపాటున వేసుకుంటే..

ABN , First Publish Date - 2021-10-19T17:35:25+05:30 IST

గర్భ నిరోధక మాత్రల వాడకం గురించి తెలిసినంతగా వాటి పనితీరు గురించిన అవగాహన మహిళల్లో ఉండదు. మరీ ముఖ్యంగా ఐ పిల్‌ లాంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్‌ను విచక్షణ లేకుండా వాడేస్తూ ఉంటారు. ఇది ప్రమాదకరం. ఐ పిల్‌, గర్భనిరోధక పద్ధతులను

గర్భనిరోధకానికి వాడే I-Pill ట్యాబ్లెట్ల గురించి చాలా మందికి తెలియని నిజాలివి.. ఆ టైమ్‌లో పొరపాటున వేసుకుంటే..

ఆంధ్రజ్యోతి(19-10-2021): గర్భ నిరోధక మాత్రల వాడకం గురించి తెలిసినంతగా వాటి పనితీరు గురించిన అవగాహన మహిళల్లో ఉండదు. మరీ ముఖ్యంగా ఐ పిల్‌ లాంటి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్‌ను విచక్షణ లేకుండా వాడేస్తూ ఉంటారు. ఇది ప్రమాదకరం. ఐ పిల్‌, గర్భనిరోధక పద్ధతులను అవలంబిస్తూ, పొరపాటున మర్చిపోయిన సందర్భంలో వాడుకోవలసిన అత్యవసర మాత్ర. నెలలో ఒకటి రెండుసార్లకు మినహాయింపు ఉంటుంది. అలాకాకుండా ఐ పిల్స్‌నే పూర్తిగా గర్భనిరోధక సాధనంగా వాడటం వల్ల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఏర్పడి నెలసరి క్రమం తప్పటం, అబార్షన్స్‌, గర్భం దాల్చలేకపోవటం లాంటి సమస్యలకు దారితీయవచ్చు. ఒకవేళ అప్పటికే గర్భందాల్చి ఉండి, పిల్‌ వాడితే దాని ప్రభావం పిండం మీద పడి జన్యుపరమైన సమస్యలతో బిడ్డ పుట్టే ప్రమాదం ఉంటుంది. నిజానికి ఐ పిల్‌ అనేది పూర్తి స్థాయిలో గర్భధారణని అడ్డుకోలేదు.


ఇది విఫలమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్‌ మాత్రల్ని 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులే వాడాలి. అంటే అండాశయాలు పూర్తిగా తయారయిన వాళ్లు మాత్రమే వాడాలి. అలాకాకుండా 16 ఏళ్ల వయసు నుంచే ఈ మాత్రల వాడకం మొదలుపెడితే, భవిష్యత్తులో దీర్ఘకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి స్త్రీలు ఈ మాత్రల మీద ఆధారపడకుండా వైద్యుల్ని కలిసి ఇతరత్రా గర్భనిరోధక ప్రత్యామ్నాయాలను తెలుసుకుని అవలంబించటం ఆరోగ్యకరం.

Updated Date - 2021-10-19T17:35:25+05:30 IST