గుర్తు తెలియని మహిళపై అత్యాచారం, హత్య

ABN , First Publish Date - 2021-05-10T16:13:37+05:30 IST

గుర్తు తెలియని ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన

గుర్తు తెలియని మహిళపై అత్యాచారం, హత్య

హైదరాబాద్/ఘట్‌కేసర్‌ రూరల్‌ : గుర్తు తెలియని ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి అన్నోజిగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అన్నోజిగూడ సర్వీసు రోడ్డు పక్కన ఉండే భవనంపై కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు.


30నుంచి 40సంవత్సరాల వయసు గల మహిళ శరీరంపై దుస్తులు లేకుండా మృతిచెంది ఉంది. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో శరీరంపై గాయాలు కనిపించడంలేదని, రెండు రోజుల క్రితమే సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు సేకరించడానికి క్లూటీంను రప్పించినట్లు తెలిపారు. హత్య జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-10T16:13:37+05:30 IST