Minister KTR పేరు చెప్పి ఆయుర్వేద వైద్యుడికి బెదిరింపులు..

ABN , First Publish Date - 2022-01-06T18:56:34+05:30 IST

మంత్రి కేటీఆర్‌ పేరుచెప్పి బెదిరింపులకు పాల్పడిన..

Minister KTR పేరు చెప్పి ఆయుర్వేద వైద్యుడికి బెదిరింపులు..

  • రెండున్నర లక్షలు వసూలు 
  • సైబర్‌ క్రైమ్స్‌లో బాధితుడి ఫిర్యాదు


హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : మంత్రి కేటీఆర్‌ పేరుచెప్పి బెదిరింపులకు పాల్పడిన కేటుగాళ్లు లక్షలు వసూలు చేశారు. నగరానికి చెందిన గోపాల్‌ నాయక్‌ ఆయుర్వేద వైద్యం ద్వారా ఇమ్యునోథెరపి చేస్తానంటూ ట్విటర్‌లో ఓ పోస్టు చేశాడు. దీన్ని చూసి కేశవులు పేరుతో ఓ ఆగంతుకుడు గోపాల్‌ నాయక్‌కు ఫోన్‌ చేశాడు. తాను మంత్రి కేటీఆర్‌ అనుచరుడినని, ఇలా ప్రకటన ఇచ్చినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసి జైల్లో పెట్టిస్తానంటూ బెదిరించాడు.


తనకు వెంటనే ఐదు లక్షలు ఇస్తే ఫిర్యాదు విషయం ఆలోచిస్తానని చెప్పాడు. దీంతో భయపడిన గోపాల్‌ నాయక్‌ రూ.2.50 లక్షలు ఆగంతుకుడు సూచించిన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఆ తర్వాత ఫోన్‌ నెంబర్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అసలు ట్విటర్‌లో అలా పోస్టులు చేయడం తప్పుకాదని తెలుసుకున్న గోపాల్‌ సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్‌ నెంబర్‌, అకౌంట్‌ నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-06T18:56:34+05:30 IST