‘టీకా’తోనే మళ్లీ సాధారణ స్థితి

ABN , First Publish Date - 2020-04-17T15:42:10+05:30 IST

సురక్షిత, సమర్థవంతమైన టీకా వస్తేనే కరోనా మహమ్మారి అంతమై.. ఒకప్పటి సాధారణ పరిస్థితులను చూడగలమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో

‘టీకా’తోనే మళ్లీ సాధారణ స్థితి

కరోనాకు అదొక్కటే పరిష్కారం: ఐరాస

ఐక్యరాజ్య సమితి, ఏప్రిల్‌ 16: సురక్షిత, సమర్థవంతమైన టీకా వస్తేనే కరోనా మహమ్మారి అంతమై.. ఒకప్పటి సాధారణ పరిస్థితులను చూడగలమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. లక్షల ప్రాణాలు నిలవాలన్నా, అంతులేని ధన నష్టం ఆగాలన్నా అదొక్కటే మార్గమని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాలతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుశా ఈ ఏడాది చివరకు టీకా అందుబాటులోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సభ్య దేశాలన్నిటి సహకారంతోనే కరోనాపై విజయం సాధించగలమన్నారు. 

Updated Date - 2020-04-17T15:42:10+05:30 IST