ఉపాధ్యాయులతో పూర్వవిద్యార్థులు
25 ఏళ్ల తరువాత ఒక చోటికి..
మద్దికెర,
మే 28: మద్దికెర జిల్లా పరిషత్ పాఠశాలలో 1996-97వ బ్యాచ్‌కు చెందిన 10వ
తరగతి విద్యార్థులు శనివారం కలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు పార్వతి,
నాగేశ్వరరావు, ఖాజాహుసేన్, ఉపాధ్యాయులతో కలిసి సంతోషంగా గడిపారు. అనంతరం
ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమను గుర్తించుకుని తిరిగి ఒకే చోట కలవడం చాలా
ఆనందంగా ఉందన్నారు. అనంతరం అందరూ కలిసి విందు భోజనాలు చేశారు.