సాదిక్‌అలీకి అన్‌సంగ్‌ హీరోస్‌ పురస్కారం

Published: Thu, 27 Jan 2022 01:09:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సాదిక్‌అలీకి అన్‌సంగ్‌ హీరోస్‌ పురస్కారం అవార్డును అందుకుంటున్న సీఐ సాదిక్‌అలీ

పీలేరు, జనవరి 26: గతంలో పీలేరు సీఐగా పనిచేసిన సాదిక్‌అలీ అన్‌సంగ్‌ హీరోస్‌ పురస్కారాన్ని అందుకున్నారు. బుధవారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో గుంటూరు జేసీ దినేష్‌ కుమార్‌ ఈ అవార్డును ఆయనకు అందజేశారు. 2020లో కురిసిన భారీ వర్షాలకు పీలేరు మండలం కామాటంపల్లె వద్ద ఉన్న పింఛానది ఉధృతంగా ప్రవహించింది. ఈ ప్రవాహంలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని సాదిక్‌అలీ సురక్షితంగా కాపాడారు. దీంతో ప్రముఖులు సీఐని అన్‌సంగ్‌ హీరోస్‌ పురస్కారానికి ఎంపిక చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.