భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

ABN , First Publish Date - 2022-07-03T14:00:31+05:30 IST

యూపీ సీఎం యోగి(UP CM Yogi) భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

Hyderabad : యూపీ సీఎం యోగి(UP CM Yogi) భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగితో పాటు బండి సంజయ్‌(Bandi Sanjay), లక్ష్మణ్‌(Lakshman), రాజాసింగ్(Raja Singh), పలువురు బీజేపీ నేతలు(BJP Leaders) అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. యోగికి ఆలయ కమిటీ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించింది. యోగి రాక సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో అణువణువునా పోలీసులు నిఘా పెట్టారు. భాగ్య లక్ష్మి టెంపుల్ చుట్టూ 500 మీటర్ల రేడియస్‌లో మూడు వలయాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. రూట్ టాప్ భద్రతను సౌత్ జోన్ పోలీసులు పటిష్టం చేశారు. మొత్తం 350మంది పోలీస్‌లతో చార్మినార్ భాగ్యలక్ష్మి లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ భద్రతను ఏర్పాటు చేశారు. హెచ్‌ఐసీసీ నుంచి 7:30కు బయలుదేరి భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు యోగి 8 గంటలకు చేరుకోనున్నారు. భాగ్యలక్ష్మి దేవాలయం ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌ను ఎస్పీజీ కమాండోస్ తమ అధీనంలోకి తీసుకున్నారు.

Updated Date - 2022-07-03T14:00:31+05:30 IST