UP CMO ట్విట్టర్ హ్యాండిల్ హ్యాకింగ్

ABN , First Publish Date - 2022-04-09T12:44:33+05:30 IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు హ్యాకింగ్ చేశారు...

UP CMO ట్విట్టర్ హ్యాండిల్ హ్యాకింగ్

లక్నో(ఉత్తరప్రదేశ్):ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు హ్యాకింగ్ చేశారు.శనివారం తెల్లవారుజామున యూపీ సీఎం అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేశారని సీఎం కార్యాలయం శనివారం తెలిపింది. 4 గంటల తర్వాత సీఎం ట్విట్టర్ ఖాతాను పాక్షికంగా పునరుద్ధరించారు.సీఎం ట్విట్టర్ ఖాతాను హ్యాకింగ్ చేసిన హ్యాకర్లు పోస్టు చేసిన ట్వీట్లను తొలగించారు.హ్యాకింగ్ తర్వాత ట్విట్టర్ ఖాతా నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోను తొలగించారు.అనంతరం వందకు పైగా ట్వీట్లను హ్యాకర్లు చేశారు.సీఎంఓ అధికారులు మళ్లీ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించి సీఎం యోగి ఫొటోను హ్యాండిల్ డిస్ ప్లేలో పెట్టారు. సాక్షాత్తూ యూపీ సీఎం ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం సంచలనం రేపింది.హ్యాకింగ్ కు ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తెలియలేదు.



Updated Date - 2022-04-09T12:44:33+05:30 IST