13 ఏళ్ల బాలికపై అత్యాచారాకి పాల్పడ్డ UP Police అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-05T16:54:37+05:30 IST

బాధితురాలిని ఏప్రిల్ 22న నలుగురు వ్యక్తులు kidnap చేసి Bhopal తీసుకెళ్లి ఆమెపై నాలుగు రోజుల పాటు అక్కడే సమూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను తిరిగి లలిత్‌పూర్ జిల్లాలోని ఆమె గ్రామానికి తీసుకువచ్చి వదిలేసి, అక్కడి నుంచి escape అయ్యారు. అనంతరం బాధితురాలిని ఆమె అత్తకు అప్పగించారు..

13 ఏళ్ల బాలికపై అత్యాచారాకి పాల్పడ్డ UP Police అరెస్ట్

లఖ్‌నవూ: తనపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ పోలీసు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. Uttar Pradesh లోని Lalitpur Police station లో స్టేషన్ ఇంచార్జిగా పని చేస్తున్న Tilakdhari Saroj అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలిపై అత్యాచారం చేసి పారిపోయిన నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు లిలిత్‌పూర్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.


విషయంలోకి వెళ్తే.. బాధితురాలిని ఏప్రిల్ 22న నలుగురు వ్యక్తులు kidnap చేసి Bhopal తీసుకెళ్లి ఆమెపై నాలుగు రోజుల పాటు అక్కడే సమూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను తిరిగి లలిత్‌పూర్ జిల్లాలోని ఆమె గ్రామానికి తీసుకువచ్చి వదిలేసి, అక్కడి నుంచి escape అయ్యారు. అనంతరం బాధితురాలిని ఆమె అత్తకు అప్పగించారు లలిత్‌పూర్ పోలీసులు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ విషయమై స్టేట్‌మెంట్ కావాలంటూ మరునాడు బాలికను పిలిపించారు. పోలీస్ స్టేషన్‌లోని ఓ గదిలో ఆమె స్టేట్‌మెంట్ తీసుకుంటూ ఆమెపై స్టేషన్ ఇంచార్జీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో బాధితురాలి అత్త కూడా పోలీస్ స్టేషన్‌లోనే ఉంది. ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.

Read more