యూపీలో మొదటి సారి వెలుగుచూసిన Omicron cases

ABN , First Publish Date - 2021-12-18T13:29:15+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారి రెండు ఒమైక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగుచూశాయి...

యూపీలో మొదటి సారి వెలుగుచూసిన Omicron cases

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారి రెండు ఒమైక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగుచూశాయి.ఈ నెల29వతేదీన మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా ఒమైక్రాన్ సోకిందని ఘజియాబాద్ ఆరోగ్యశాఖాధికారులు చెప్పారు. ఇద్దరు రోగుల్లో కరోనా లక్షణాలు కనిపించలేదని, దీంతో వీరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. ఒమైక్రాన్ సోకిన ఇద్దరు రోగుల వయసు 60 ఏళ్లకు పైబడిన వారు. ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడటంతో ఉత్తరప్రదేశ్ సర్కారు అప్రమత్తమైంది. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.ఒమైక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.


యూరప్ దేశాల్లో ఒమైక్రాన్ కేసులసంఖ్య పెరుగుతున్నందున ప్రజలు నూతన సంవత్సర వేడుకలు, పండుగలకు దూరంగా ఉండాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ సలహా ఇచ్చారు.గతంలో చూడని స్థాయిలో ఒమైక్రాన్ కేసులు వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ డీజీ చెప్పారు.


Updated Date - 2021-12-18T13:29:15+05:30 IST