అత్యాచారం చేస్తానంటూ Muslim మహిళలను బెదిరించిన భజరంగ్ మునిదాస్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-14T18:20:06+05:30 IST

ముస్లిం మహిళలపై అత్యాచారం చేస్తామని బెదిరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆశ్రమం అధిపతిని అరెస్ట్‌ అయ్యాడు....

అత్యాచారం చేస్తానంటూ Muslim మహిళలను బెదిరించిన భజరంగ్ మునిదాస్ అరెస్ట్

లక్నో: ముస్లిం మహిళలపై అత్యాచారం చేస్తామని బెదిరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆశ్రమం అధిపతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర రాజధాని లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్‌లో ఖైరాబాద్‌లోని మహర్షి శ్రీ లక్ష్మణ దాస్ ఉదాసిన్ ఆశ్రమం అధిపతి భజరంగ్ ముని దాస్‌ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల సమక్షంలో ఒక మతపరమైన ఊరేగింపులో అతను షాకింగ్ కామెంట్లు చేసిన 11 రోజుల తర్వాత అతన్ని అరెస్టు చేశారు.ఏప్రిల్ 2వతేదీన అతను అత్యాచారం చేస్తామని బెదిరించినట్లు వినిపిస్తున్న రెండు నిమిషాల ప్రసంగం వీడియో గత శుక్రవారం వైరల్ అయింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇలాంటి వ్యాఖ్యలపై పోలీసులు మౌనంగా ఉండరాదని కమిషన్ సూచించింది.


వ్యాఖ్యలు చేసిన భజరంగ్ మునిదాస్ ను అరెస్టు చేయాలని కమిషన్ కోరింది.ఆ తర్వాత అతడిపై కేసు నమోదైంది. భజరంగ్ ముని దాస్‌పై భారత శిక్షాస్మృతి సెక్షన్ల కింద ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, అవమానకరమైన ప్రకటనలు చేయడం, లైంగిక వేధింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదైంది.కేసు నమోదైన కొన్ని గంటల తర్వాత భజరంగ్ ముని క్షమాపణలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

Updated Date - 2022-04-14T18:20:06+05:30 IST