యూపీలో మే 17 వ‌ర‌కూ లాక్‌డౌన్‌ పొడిగింపు!

May 9 2021 @ 13:04PM

ల‌క్నో: యూపీలో పెరుగుతున్న కరోనా కేసుల నియంత్ర‌ణ‌కు మే 17 న ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్ర‌క‌టించారు. ఈ సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. కాగా గ్రామాల్లో టీకాలు వేయడం, పరిశుభ్రతా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం వేగవంతం చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారుల‌ను ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల దుకాణాలు, మందుల దుకాణాలతోపాటు ఈ-కామర్స్ సంస్థ‌లు ప‌నిచేయ‌నున్నాయి. క‌రోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితోనే ప‌నిచేయాల‌ని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వికలాంగులు, గర్భిణులు ఇంటి నుండే పనిచేసే అవ‌కాశం కల్పించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.