Hindu దేవుళ్ల చిత్రాల పేపర్లపై చికెన్ విక్రయం...నిందితుడి Arrest

ABN , First Publish Date - 2022-07-05T16:19:38+05:30 IST

హిందూ దేవతల ఫొటో పేపర్లపై కోడిమాంసాన్ని విక్రయిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు యూపీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

Hindu దేవుళ్ల చిత్రాల పేపర్లపై చికెన్ విక్రయం...నిందితుడి Arrest

సంభాల్ (ఉత్తరప్రదేశ్): హిందూ దేవతల ఫొటో పేపర్లపై కోడిమాంసాన్ని విక్రయిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు యూపీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంభాల్ పట్టణానికి చెందిన తాలిబ్ హుస్సేన్ తన దుకాణంలో చికెన్‌ను హిందూ దేవతల బొమ్మలు ఉన్న కాగితంపై అమ్ముతున్నాడని,దీంతో తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాడని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసు బృందం అతని చికెన్ దుకాణానికి చేరుకున్నప్పుడు తాలిబ్ హుస్సేన్ హత్య చేయాలనే ఉద్ధేశంతో వారిపై కత్తితో దాడికి యత్నించాడని పోలీసులు కేసు పెట్టారు.తాలిబ్ హుస్సేన్‌పై ఐపీసీ సెక్షన్లు 153-ఏ, 295-ఎ కింద పోలీసులు అభియోగాలు మోపారు. 


Updated Date - 2022-07-05T16:19:38+05:30 IST