Viral News: లాయర్ vs రైల్వే.. రూ.20 కోసం 22ఏళ్ల పోరాటం.. చివరికి విజయం ఎవరిదంటే..

ABN , First Publish Date - 2022-08-13T02:21:14+05:30 IST

ఆయన ఒక లాయర్. మొదటిసారిగా స్టేషన్‌కు వెళ్లి, రైలు టికెట్లు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో అక్కడ రైలు టికెట్లు ఇచ్చే క్లర్క్.. అతడి వద్ద రూ.20 అదనంగా తీసుకున్నాడు. ఇదేం

Viral News: లాయర్ vs రైల్వే.. రూ.20 కోసం 22ఏళ్ల పోరాటం.. చివరికి విజయం ఎవరిదంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ఒక లాయర్. మొదటిసారిగా స్టేషన్‌కు వెళ్లి, రైలు టికెట్లు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో అక్కడ రైలు టికెట్లు ఇచ్చే క్లర్క్.. అతడి వద్ద రూ.20 అదనంగా తీసుకున్నాడు. ఇదేం అని ప్రశ్నిస్తే.. అతడి వద్ద నుంచి సరియైన సమాధానం లేదు. దీంతో ఆగ్రహానికి లోనైన లాయర్.. వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. 22ఏళ్లుగా పోరాటం చేశాడు. తాజాగా కోర్టు తీర్పు వచ్చింది. ఈ కేసులో విజయం ఎవరిని వరించిందనే విషయం తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన తుంగనాథ్ చతుర్వేది(Tungnath Chaturvedi) ఒక లాయర్. ఈయన 22ఏళ్ల క్రితం అంటే 1999లో మథుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. మొరాదాబాద్‌కు( Mathura to Moradabad) రెండు టికెట్లు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోనే టికెట్ క్లర్క్‌కు రూ.100నోటు ఇచ్చాడు. సదరు క్లర్క్.. ఆ నోటు తీసుకుని.. రూ.10 నోటును చతుర్వేది చేతుల్లో పెట్టాడు. టికెట్‌కు రూ.35 చొప్పున రెండు టికెట్లకు రూ.70 తీసుకోకుండా.. రూ.90 వసూలు చేయడంతో చతుర్వేది షాక్ అయ్యాడు. అనంతరం తనకు ఇంకా రూ.20 ఇవ్వాల్సి ఉంటుందని క్లర్క్‌ను అడిగాడు. దానికి అక్కడున్న క్లర్క్ నిరాకరించాడు. దీంతో ఆయన ఆగ్రహానికి లోనయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని పేర్కొంటూ.. వినియోగదారుల కోర్టును(Legal Suit) ఆశ్రయించారు. 



ఈ కేసు సుమారు 22ఏళ్లపాటు కొనసాగింది. ఈ ఇన్నేళ్ల కాలంలో సుమారు 100 సార్లు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చతుర్వేది కష్టం ఫలించింది. ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు వెల్లడించింది. రైల్వే(Railways)కు రూ.15వేల ఫైన్ విధించిన కోర్టు.. ఆ మొత్తాన్ని చతుర్వేదికి అందించాల్సిందిగా ఆదేశించింది. అంతేకాకుండా ఆయన వద్ద వసూలు చేసిన రూ.20ని 22ఏళ్ల కాలానికి 12శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని స్పష్టం చేసింది. 30 రోజుల్లో ఈ మొత్తాన్ని చతుర్వేదికి అందించన పక్షంలో 15శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 


Updated Date - 2022-08-13T02:21:14+05:30 IST