అఖిలేశ్ యాదవ్ ఈవీఎంల తరలింపు ఆరోపణలపై ఈసీ యాక్షన్.. అధికారిపై వేటు!

Published: Wed, 09 Mar 2022 19:46:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అఖిలేశ్ యాదవ్ ఈవీఎంల తరలింపు ఆరోపణలపై ఈసీ యాక్షన్.. అధికారిపై వేటు!

లక్నో: ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు ఈవీఎంలను ఓ వ్యాన్‌లో అక్రమంగా తరలించడం ఉత్తరప్రదేశ్‌లో పెను వివాదానికి దారితీసింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ విషయాన్ని నిన్న వెలుగులోకి తీసుకొచ్చారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు.


స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారణాసి కలెక్టర్ ఈవీఎంలను తరలించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం దృష్టిసారించాలని కోరారు. అఖిలేశ్ ఆరోపణలను నిజం చేస్తూ బుధవారం ఉదయం సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది.


ఆ వీడియోలో వారణాసి కమిషనర్ దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈవీఎంల తరలింపులో లోపం జరిగిన మాట వాస్తవమేనని, దానిని తాను అంగీకరిస్తానని అన్నారు. ఈ వీడియో కూడా కలకలం రేపింది. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వెంటనే రంగంలోకి దిగింది.


వారాణాసి ఏడీఎంపై చర్యలు తీసుకోవాలంటూ  ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో)ను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్  శర్మ మాట్లాడుతూ.. ఈవీఎంలను ఈ రోజు తరలించాల్సి ఉందని, కానీ ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏడీఎం ఎన్‌కే సింగ్‌ తరలించారని చెప్పారు. ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.