‘రివాల్వర్ రాణి’ రాజీనామాకు ఎట్టకేలకు ఆమోదం

ABN , First Publish Date - 2021-09-13T13:26:00+05:30 IST

సోషల్ మీడియా ట్రోలింగ్‌తో ఇబ్బందుల్లో పడిన ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగానికి...

‘రివాల్వర్ రాణి’ రాజీనామాకు ఎట్టకేలకు ఆమోదం

ఆగ్రా: సోషల్ మీడియా ట్రోలింగ్‌తో ఇబ్బందుల్లో పడిన ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన మహిళాకానిస్టేబుల్ ప్రియాంకామిశ్రా రాజీనామాకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ప్రభుత్వ తుపాకీతో వీడియో తీసి, వార్తల్లోకెక్కిన మహిళా కానిస్టేబుల్ ప్రయాంకా మిశ్రా అనంతర పరిణామాలతో రాజీనామా చేశారు. 


ఎట్టకేలకు ఆమె రాజీనామాను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆగ్రాలోని ఎంఎం గేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ప్రియాంకా మిశ్రా పోలీసు యూనిఫారంలో చేతిలోకి తుపాకీతో కనిపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెపై రకరకాలుగా విమర్శలు గుప్పించారు. దీంతో తీవ్రంగా కలత చెందిన ఆమె తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. కాగా తాను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోను ప్రియాంకా మిశ్రా స్వయంగా తొలగించారు. అయితే అప్పటికే లక్షమంది ఈ వీడియో చూశారు. అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమె ఫాలోవర్స్ సంఖ్య అమాతం పెరిగిపోయింది. ఈ పరిణామాల నేపధ్యంలోనే ప్రియాంక తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సోషల్ మీడియాలో ప్రియాంకను ‘రివాల్వర్ రాణి’ అంటూ ట్రోల్ చేశారు. 

Updated Date - 2021-09-13T13:26:00+05:30 IST