girl friend కోసం యువతి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది...

ABN , First Publish Date - 2022-06-27T17:09:34+05:30 IST

తన ప్రియురాలి (girl friend) కోసం ఓ యువతి లింగమార్పిడి చేయించుకున్న అరుదైన ఘటన...

girl friend కోసం యువతి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది...

ప్రయాగరాజ్(ఉత్తరప్రదేశ్): తన ప్రియురాలి (girl friend) కోసం ఓ యువతి లింగమార్పిడి చేయించుకున్న అరుదైన ఘటన యూపీలో సంచలనం రేపింది.తోటి స్నేహితురాలైన యువతితో ప్రేమలో పడిన మరో యువతి ఆమెతో కలిసి కాపురం చేసేందుకు వీలుగా లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌ నగరంలో సోమవారం వెలుగుచూసింది. ప్రయాగరాజ్ నగరానికి చెందిన ఇద్దరు యువతులు లెస్బియన్లు. వారు కలిసి జీవితం గడుపుదామని ప్రమాణం చేసుకున్నారు. అయితే వారి సంబంధాన్ని రెండు కుటుంబాలు అంగీకరించక పోవడంతో వారిలో ఓ మహిళ తన లింగాన్ని మార్చుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. 


తన జీవిత భాగస్వామి అయిన తోటి స్నేహితురాలి ప్రేమలో ఉన్న యువతి భవిష్యత్తులో అడ్డంకుల నివారణకు వీలుగా లింగమార్పిడి చేయించుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్‌లోని వైద్యుల బృందం యువతి శరీర పైభాగాలు, ఛాతీ పునర్నిర్మాణానికి వీలుగా లింగమార్పిడి శస్త్రచికిత్స చేసింది. శస్త్రచికిత్సకు మరో ఏడాదిన్నర సమయం పడుతుందని, ఆ తర్వాత యువతి పురుషుడిగా మారుతుందని వైద్యులు తెలిపారు.లింగమార్పిడి చేయించుకున్న యువతికి టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఇస్తామని, దీనివల్ల ఛాతీ భాగంలో వెంట్రుకలు మొలుస్తాయని వైద్యులు చెప్పారు. లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత మహిళ గర్భవతి అయ్యే పరిస్థితి ఉండదని డాక్టర్డాక్టర్ మోహిత్ జైన్ వివరించారు. 


‘‘ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారి.18 నెలల వ్యవధిలో లింగమార్పిడి చికిత్స పూర్తవుతుంది,లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న యువతి పూర్తి ఆరోగ్యంగా ఉంది’’అని డాక్టర్ మోహిత్ చెప్పారు. 


Updated Date - 2022-06-27T17:09:34+05:30 IST