ఉపాధి బకాయిలను వెంటనే చెల్లించాలి

ABN , First Publish Date - 2021-07-24T06:24:48+05:30 IST

జాతీయ ఉపాధిహామీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు తక్ష ణమే చెల్లించాలని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

ఉపాధి బకాయిలను వెంటనే  చెల్లించాలి
ఎమ్మెల్యే రవికుమార్‌

ఎమ్మెల్యే రవికుమార్‌


అద్దంకి, జూలై 23: జాతీయ ఉపాధిహామీ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు తక్ష ణమే  చెల్లించాలని అద్దంకి  శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో జూన్‌, జూలై నెలలకు సంబంధించి ఉపాధి కూలీలలకు చెందిన బ కాయిలు రూ.209 కోట్లను వెంటనే చెల్లించాలన్నారు. అద్దంకి నియోజకవర్గంలోనే రెండు నెలలకు సంబంధించి రూ.13.16 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. నెల ల తరబడి చెల్లింపులు జరగకపోవటంతో కూలీల కు టుంబాలు  ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వేల కోట్ల  రూపాయల ని ధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించి లక్షలాది మంది కూలీలలకు అన్యాయం చేస్తుందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ,బీసీ, ఇతర ప్రజా ప్రతినిధులు ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పథకం కింద చేసిన అ భివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా విడుదల చేయలేదన్నారు. సుప్రీంకోర్టు సూచించినా పట్టించుకోకుండా రాజకీయ కక్ష్యతో ఆ నిధులు విడుదల చేయకు ండా విడుదల చేసినట్లు కోర్టుకు తప్పుడు  నివేదికలు ఇచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో ప నులు చేపట్టడానికి కాం ట్రాక్టర్‌లు ముందుకు రా వటం లేదన్నారు. కనీసం  మరమ్మతులు  కూడా చే యకపోవటం వల్లనే రో డ్లు చెరువులను తలపిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందిం చి బిల్లులు చెల్లించాలని, లేకుంటే ప్రభుత్వంపై పోరు తప్పదని ఆయన హెచ్చరించారు.


Updated Date - 2021-07-24T06:24:48+05:30 IST