ఉపాధి వేతనాల మెమోను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-06-22T07:13:03+05:30 IST

ఉపాధి వేతనాలు కులాల వారీగా చెల్లించే పద్ధతిని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మెమోనురద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉభయ వ్యవసాయకార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

ఉపాధి వేతనాల మెమోను రద్దు చేయాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు

కలెక్టరేట్‌ వద్ద వ్యవసాయ కార్మికసంఘాల నేతల ధర్నా

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 21 : ఉపాధి వేతనాలు కులాల వారీగా చెల్లించే పద్ధతిని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌  చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మెమోనురద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉభయ వ్యవసాయకార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు ఆర్‌ వెంకట్రావు, కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలో ఒక వైపు మతం పేరుతో విభజనలు పెంచుతూ మతసామరస్యాన్ని విచ్ఛినం చేస్తూ ఇంకో వైపు కులం పేరుతో శ్రమజీవుల మధ్య చిచ్చుపెట్టే చర్యలు చేపట్టారని ఆరోపించారు. ఉపాధి కూలీలకు గతంలో వేతనాలు ఏకులంలో  ఉన్నా  ఒకేసారి అందరికీవచ్చేవన్నారు. వాటిని మోదీ ప్రభుత్వం కులాలవారీగా విడదీసి చెల్లించే మెమోను తీసుకు రావడం దుర్మార్గంగా ఉందన్నారు. ఈవిధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకుల కరవది సుబ్బారావు, జాలా అంజయ్య, బి రఘరాం, వి బాలకోటయ్య, నురుసుల వెంకటేశ్వర్లు, జీపీ రామారావు, దాసరి అంజయ్య, కే కోటేశ్వరరావు, పురిణి గోపి, మల్లవరపు ప్రసాద్‌, కొంగర నరసింహం, జీ నరసింహారావు తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-06-22T07:13:03+05:30 IST