ట్రాన్స్ జెండర్లతో ఆత్మీయంగా ఉపాసన... నెటిజన్ల ప్రశంసలు!

Dec 3 2021 @ 18:39PM

స్వలింగ సంపర్కులు, నపుంసకులు తదితర LGBT ల గురించి అవగాహన తక్కువ ఉన్న సమాజం మనది. కానీ, వారితో స్నేహంగా ఉండి, ఇంటి వేడుకలలో వారిని భాగం చేసింది మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదల. ఒక ట్రాన్స్ జెండర్ తో అన్యోన్యంగా ఉన్న ఫొటోను ఉపాసన తన Instagram లో షేర్ చేసింది. "కలయికని, మానవీయతని, ఇంకా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఆశీర్వచనాల వేడుక కంటే మంచి సందర్భం ఏముంది?" అని మెసేజ్ కూడా పెట్టిందామె. 


తనకు ట్రాన్స్‌ జెండర్స్‌ ఫ్రెండ్స్ ఉన్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏ దాపరికాలు లేకుండా చెప్పిన ఉపాసన, తన సోదరి పెళ్లి ఏర్పాట్లకు ట్రాన్స్‌ జెండర్లని ఆహ్వానించి, వారిని వేడుకలో భాగం చేసింది. సోదరి అనుషపాలా పెళ్లి వేడుకల్లో భాగంగా ట్రాన్స్ జెండర్ల ఆశీస్సులు తీసుకుందామె. . అనంతరం వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ ఫోటోలను మెగా కోడలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.


లక్ష్మీనారాయణ త్రిపాఠి అమ్మా నిండు మనసుతో మీరు ఈ పెళ్లి వేడుకల్ని ప్రారంభించినంఉకు సంతోషంగా ఉంది. నిండైన జీవితాన్ని నిండారా అనుభవించడం ఎప్పుడూ మీరు నేర్పిందే" అంటూ లక్ష్మీనారాయణ త్రిపాఠి ని అక్కున జేర్చుకొని ఒక ఫోటో పెట్టింది ఉపాసన. హైదరాబాద్ లోని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని గౌరవిస్తానని, అది ఇది మన దేశంలోని అనాది సమాజాల్లో ఒకటని ఆ పోస్టులో ఆమె పేర్కొంది.

"హైదరాబాద్ లోని 6 బదాయి గృహాల ప్రతినిథులకు ఆతిథ్యం ఇవ్వడం  విశేషంగా భావిస్తున్నాం. వారి కథలు జీవన సారాన్ని బోధించే నిధులు.  ఆ కమ్యూనిటీతో మరింత సన్నిహితంగా మెలగగలుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది," అని పోస్ట్ చేసింది ఉపాసన.


సామాజిక అంశాల మీద స్పందిస్తూ, ఆరోగ్య సలహాలు అందిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది ఉపాసన. మల విసర్జన సమయంలో టాయ్‌లెట్‌లో  వెస్టర్న్ కమోడ్‌ కంటే భారతీయ కమోడ్‌లను వినియోగించడమే ఆరోగ్యానికి అత్యంత సురక్షితమంటూ తన ఫొటోలతో ఉపాసన ప్రచారం చేసిన విషయం తెలిసిందే.  


ఎల్.జి.బి.టి.క్యు.ఐ.ఏ వంటి లైంగిక అల్పసంఖ్యాకవర్గాల (sexual minorities) పట్ల సమాజానికి చిన్నచూపు ఉండటం, సినిమా వంటి పాపులర్ మీడియంలో వారు హేళనకి గురికావడం సర్వసాధారణమైన ప్రస్తుత పరిస్థితుల్లో, ట్రాన్స్‌ జెండర్ల తో సన్నిహితంగా మెలిగి వాటిని ఉపాసన బోల్డ్ గా  షేర్ చేయడం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇటువంటి పోస్ట్స్ ప్రజల్లో  ఆలోచన పెంచి, ట్రాన్స్ జెండర్ల పట్ల మంచి అవగాహన కలిగిస్తాయంటున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.