రానున్నది ఇందిరమ్మ రాజ్యం

ABN , First Publish Date - 2022-05-22T05:32:08+05:30 IST

రానున్నది ఇందిరమ్మ రాజ్యమని, ప్రజల కష్టాలకు తెర పడనుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

రానున్నది ఇందిరమ్మ రాజ్యం
రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

- కేద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకి కాంగ్రెస్‌ పార్టీ

- రచ్చబండలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ రూరల్‌, మే 21:  రానున్నది ఇందిరమ్మ రాజ్యమని, ప్రజల కష్టాలకు తెర పడనుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంఽధీ వరంగల్‌ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లోని అంశాలను ప్రజలకు వివరించారు. రచ్చబండ కార్యక్రమం సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన మహిళలు, వృద్ధులను ప్రభుత్వ పాలనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాగ్రెస్‌ మండల అధ్యక్షుడు సాయిళ్ల రాజు, పొన్నం సత్యంగౌడ్‌, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, శ్రావణ్‌నాయక్‌, వైద్యుల అంజన్‌కుమార్‌, రహమత్‌ ఉస్సేన్‌, పులి అంజనేయులు గౌడ్‌, ఎండీ తాజ్‌, మల్యాల సుజిత్‌కుమార్‌, పెంచాల లక్ష్మణ్‌రావు, బొబ్బిలి విక్టర్‌, నిహాల్‌,  ముద్దసాని రంగన్న, హరీష్‌గౌడ్‌, ఇర్ఫాన్‌, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 


 తిమ్మాపూర్‌ మండలంలో ఉద్రిక్తం


తిమ్మాపూర్‌: టీపీసీసీ తలపెట్టిన రైతు రచ్చబండ కార్యక్రమం మొదటి రోజు తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెం గ్రామంలో శనివారం ఉద్రిక్తతకు దారితీసింది.  మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంబించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది నాయకులు అక్కడికి వచ్చారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ  రైతు డిక్లరేషన్‌పై ప్రసంగిస్తున్న సమయాల్లో కొందరు టిఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు కూడా టీఆర్‌ఎస్‌కు నాయకులపై మాటాలతో ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న సీఐ శశిధర్‌రెడ్డి, ఎల్‌ఎండీ ఎస్సై ప్రమోద్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్ధిచెప్పారు.

Updated Date - 2022-05-22T05:32:08+05:30 IST