మహేశ్ బాబు Sarkaru Vaari Paata, Doctor Strange 2.. OTT లోకి ఎప్పుడు రాబోతున్నాయంటే..

Published: Fri, 27 May 2022 11:05:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మహేశ్ బాబు Sarkaru Vaari Paata, Doctor Strange 2.. OTT లోకి ఎప్పుడు రాబోతున్నాయంటే..

మే నేలలో విడుదలై చిత్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమాల్లో మహేశ్ బాబు (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’, మార్వెల్ మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్: ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు మూవీస్ కూడా విడుదల తర్వాత మంచి టాక్‌ని సొంతం చేసుకున్నాయి. సర్కారు వారి పాట విడుదలైన రెండు వారాల్లోనే దాదాపు రూ.200 గ్రాస్ కలెక్షన్లని కొల్లగొట్టింది. పరశురామ్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. నదియా, సముద్రఖని, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రల్లో నటించారు.


అలాగే.. ‘అవెంజర్స్’ సిరీస్ మూవీస్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన బెనెడిక్ట్ కుంబర్ బ్యాచ్ ప్రధాన పాత్రలో నటించిన డాక్టర్ స్ట్రేంజ్ 2 దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో మే 6న విడుదలై ఇప్పటి వరకూ దాదాపు రూ.140 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. మంచి హిట్స్ సాధించిన ఈ రెండు సినిమాల OTT విడుదల గురించి తాజాగా ఓ ఇంట్రస్టింగ్ రూమర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


ఆ వార్తల ప్రకారం, సర్కారు వారి పాట వచ్చే నెల అంటే జూన్ 10 లేదా 22న విడుదల కానుందట. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీకి వేదిక కానుందని వినికిడి. అలాగే.. డాక్టర్ స్ట్రేంజ్ 2 సైతం జూన్ 22న ఇతర మార్వెల్ ‘అవెంజర్స్’ సిరీస్ మూవీస్‌లాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుందని సమాచారం. అయితే వీటికి సంబంధించి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ నుంచి కానీ, మేకర్స్ నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International