ఉర్దూ పాఠశాలలో ఊడిపడిన పైపెచ్చులు

ABN , First Publish Date - 2022-07-07T05:06:57+05:30 IST

గోనెగండ్లలోని ఉర్దూ పాఠశాలలో బుధవారం కురిసిన స్వల్ప వర్షానికి పాఠశాల పై పెచ్చులు ఊడిపడ్డాయి.

ఉర్దూ పాఠశాలలో ఊడిపడిన పైపెచ్చులు
ఉరూ ్ధపాఠశాలలో బుధవారం పై పెచ్చులు ఊడి పడ్డ దృశ్యం

    మూడు నెలల క్రితం ఇలాగే  

గోనెగండ్ల, జూలై 6:   గోనెగండ్లలోని ఉర్దూ పాఠశాలలో బుధవారం కురిసిన స్వల్ప వర్షానికి  పాఠశాల పై పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ విద్యార్ధులు ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది.   మూడు నెలల క్రితం ఇదే పాఠశాలలో పై పెచ్చులు ఊడి పడి ఇద్దరు విద్యార్థుల తలలకు గాయాలయ్యాయి. అప్పుడు పలువురు నాయకులు స్పందించారు.  రెండో విడత నాడు నేడు పనులలో పాఠశాలలో మరమ్మతు పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే రెండో విడత నాడు నేడు పనులకు  ఈ పాఠశాల ఎంపిక కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. 


 


Updated Date - 2022-07-07T05:06:57+05:30 IST