ఇసుకలో బంగారం కోసం

ABN , First Publish Date - 2020-11-27T06:01:17+05:30 IST

ఉప్పాడ తీరంలో బంగారు రజను(చిన్న చిన్న బంగారం ముక్కలు) కోసం వేట మొదలైంది. తుఫాన్‌లు తీరాన్ని తాకిన అనంతరం ఒడ్డున ఉన్న ఇసుకలో బంగారు రజను కోసం అన్వేషణ మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

ఇసుకలో బంగారం కోసం
బంగారం కోసం వెతుకులాడుతున్న దృశ్యం

ఉప్పాడ (కొత్తపల్లి), నవంబరు 26: ఉప్పాడ తీరంలో బంగారు రజను(చిన్న చిన్న బంగారం ముక్కలు) కోసం వేట మొదలైంది.  తుఫాన్‌లు తీరాన్ని తాకిన అనంతరం ఒడ్డున ఉన్న ఇసుకలో బంగారు రజను కోసం అన్వేషణ మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. వందల సంవత్సరాల కిందట ఆయా ప్రాంతాల్లో పెద్ద,పెద్ద భవంతులు, ఆలయాలు, డబ్బున్న షావుకారుల ఇళ్ళు సముద్రంలో కలిసిపోయాయని మత్స్యకార పెద్దలు చెబుతుండేవారు. తుఫాన్‌లు తీరాన్ని తాకిన అనంతరం ఆ ప్రభావానికి చిన్నచిన్న బంగారు ముక్కలు బయటకు వస్తాయని ఇక్కడ మత్స్యకారుల నమ్మకం..  దీంట్లో భాగంగానే గురువారం మధ్యాహ్నం నుంచి మత్స్యకారులు వర్షం కురుస్తున్నప్పటికీ గొడుగుల సాయంతో ఇసుకలో బంగారు రజను కోసం వెతుకులాట ప్రారంభించారు. ఒకరిద్దరికి చిన్నపాటి రజను దొరికినట్లు చెబుతున్నారు. 

Updated Date - 2020-11-27T06:01:17+05:30 IST