కుమారుడు వెంకటరమణాకాంత్రెడ్డిని అభినందిస్తున్న తల్లిదండ్రులు వెంకటరమణారెడ్డి, లక్ష్మినారాయణమ్మ
చెన్నూరు, జూన్ 28: చెన్నూరు మండలం ఉప్పరపల్లెకు చెందిన గాజులపల్లి వెంకటరమణాకాంత్‌రెడ్డి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎ్‌ఫఎ్‌స)లో 34వ ర్యాంకు సాధించాడు. ఈయన తండ్రి జి.వెంకటరమణారెడ్డి ఖాజీపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పని చేస్తుండగా తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహిణి. ఈయన బీటెక్, ఎంటెక్, ఐఐటీ ఢిల్లీలో చదివారు. చదువు పూర్తికాగానే కొంతకాలం జపాన్‌లోని డైకెన్ ఎస్‌లో పనిచేశారు. అనంతరం ఐఏఎస్ లక్ష్యంగా స్వదేశం చేరుకుని ఢిల్లీలోని వాజీరామ్, రవి కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నారు. వరుసగా నాలుగుసార్లు సివిల్స్ పరీక్షలు రాశారు. నాలుగో దఫా ఇంటర్వ్యూలో పోయింది. రెండో అటెంప్ట్‌లో ఐఎఫ్ఎస్లో 34వ ర్యాంకు సాధించారు. ఈ మేరకు మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా గాజులపల్లి వెంకటరమణాకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఐఏఎస్ సాధించాలనేది తన లక్ష్యమని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు తన తాతగారైన మాజీ సర్పంచ్ జయరామిరెడ్డి, చిన్నాన్న ఎన్.జగన్మోహన్ రెడ్డిల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. చిన్నవయసులోనే (27) వెంకటరమణాకాంత్‌రెడ్డి ఐఎ్‌ఫఎ్‌సలో ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులతో పాటు చెన్నూరు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.