తిరుమలేశుడి సేవలో ‘సుప్రీం’ సీజే లలిత్‌

ABN , First Publish Date - 2022-10-03T09:13:02+05:30 IST

సుప్రీంకోర్టు ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు.

తిరుమలేశుడి సేవలో ‘సుప్రీం’ సీజే లలిత్‌

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, తెలంగాణ న్యాయమూర్తులు

తిరుమల, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో జస్టిస్‌ లలిత్‌కు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలు, 2023 టీటీడీ క్యాలెండర్‌, శ్రీవారి చిత్రపటాన్ని చైర్మన్‌, ఈవో అందజేశారు. సీజేఐతోపాటు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కూడా స్వామిని దర్శించుకున్నారు. కాగా.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ దుప్పల వెంకటరమణ, జస్టిస్‌ సీహెచ్‌.మానవేంద్రనాథ్‌ రాయ్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌ రావు కూడా ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

Updated Date - 2022-10-03T09:13:02+05:30 IST