‘ఒకే జిల్లా.. ఒకే ప్రొడక్ట్’ కోసం ‘కూ’తో ఒప్పందం కుదుర్చుకున్న యూపీ

ABN , First Publish Date - 2022-07-31T01:11:50+05:30 IST

‘ఒకే జిల్లా..ఒకే ప్రొడక్ట్’ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్ కూ (Koo)తో ఒప్పందం కుదుర్చుకుంది

‘ఒకే జిల్లా.. ఒకే ప్రొడక్ట్’ కోసం ‘కూ’తో ఒప్పందం కుదుర్చుకున్న యూపీ

లక్నో: ‘ఒకే జిల్లా..ఒకే ప్రొడక్ట్’ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్ కూ (Koo)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు యూపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME), ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ విభాగం కూతో (MoU) కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా కూ తన ప్లాట్‌ఫాంపై 10 భాషల్లోని ఓడీఓపీ (ODOP) కంటెంట్, ప్రొడక్ట్‌లపై వినియోగదారులకు అవగాహన పెంచేందుకు ఈ  ప్రచారం ఉపయోగపడుతుంది. యూపీ ఓడీఓపీ (UP-ODOP) సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, ప్రత్యేకించి ఇంగ్లీషు మాట్లాడని వారి కోసం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే స్థానిక కళాకారులు ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి, దేశవ్యాప్తంగా వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు, ఎక్కువ మందితో కమ్యూనికేట్ అయ్యేందుకు ఈ అవగాహనా ఒప్పందం ఎంతగానో ఉపయోగపడనుంది. 


 ఎంఎస్ఎంఈ అదనపు చీఫ్ సెక్రటరీ నవ్‌నీత్ సెహగల్, కూ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా నవ్‌నీత్ సెహగల్ మాట్లాడుతూ.. కూ(Koo)తో ఈ అనుబంధం తమ ఓడీఓపీ ఉత్పత్తులను ఎక్కువ మందికి చేరవేయడంలో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ..  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు.  

Updated Date - 2022-07-31T01:11:50+05:30 IST