UPSC ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించిన Shruti Sharmaకు షాకింగ్ అనుభవం.. రిజల్ట్ వచ్చి ఒక్క రోజు కూడా గడవకముందే..

ABN , First Publish Date - 2022-06-03T00:07:00+05:30 IST

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో సత్తా చాటిన శ్రుతి శర్మకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రిజల్ట్స్ వచ్చి 24 గంటలు కూడా గడవకముందే కొందరు ఆకతాయిలు నానా హంగామా చేశారు.

UPSC ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించిన Shruti Sharmaకు షాకింగ్ అనుభవం.. రిజల్ట్ వచ్చి ఒక్క రోజు కూడా గడవకముందే..

ఇంటర్నెట్ డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో సత్తా చాటిన శ్రుతి శర్మకు షాకింగ్ అనుభవం ఎదురైంది. రిజల్ట్స్ వచ్చి 24 గంటలు కూడా గడవకముందే కొందరు ఆకతాయిలు నానా హంగామా చేశారు. వాళ్లు చేసిన పనికి Shruti Sharma వివరణ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



Civil Services Exam 2021 రిజల్ట్‌ను UPSC గత నెల 30న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన Shruti Sharma సత్తా చాటారు. తొలి ర్యాంకు సాధించి.. విజయ కేతనం ఎగరవేశారు. రిజల్ట్స్ విడుదలైన కొద్ది గంటల్లోనే గుర్తు తెలియని కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో గందరగోళం సృష్టించారు. ఆమె పేరు మీద ఫేక్ ట్విట్టర్ అకౌంట్లను సృష్టించి హడావిడి చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. చివరకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. తన ట్విట్టర్ ఖాతా వివరాలను వెల్లడించారు. shrutisharma986 పేరుతో ట్విట్టర్ అకౌంట్ మాత్రమే తనదని స్పష్టం చేశారు. తన పేరు మీద ఉన్న ఇతర ట్విట్టర్ అకౌంట్లు ఫేక్ అని వివరించారు. 


Updated Date - 2022-06-03T00:07:00+05:30 IST