
వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు పెట్టడమే కాదు.. ఎంతో మంది ప్రాణాలను కూడా బలిగొంటున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు చనిపోయారు. తన ప్రియుడిని భర్తే చంపించాడని తెలియడంతో ఓ మహిళ రైలు కింద పడి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ తన భర్త మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలిసి భర్త ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె భర్త మాట వినకుండా వివాహేతర సంబంధం కొనసాగించింది. తీవ్ర ఆగ్రహం పెంచుకున్న భర్త తన మేనల్లుడిని ఆదివారం చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారమే నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రియుడు చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ సోమవారం మధ్యాహ్నం రైలు కింద పడి చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి