యురేనియం తవ్వకాలను నిలిపివేయాలి

ABN , First Publish Date - 2022-01-29T05:07:57+05:30 IST

నల్లమలలో యురే నియం తవ్వకాలను నిలిపివేయాలని నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ కన్వీనర్‌ కలుముల నాసరయ్య డిమాండ్‌ చేశారు.

యురేనియం తవ్వకాలను నిలిపివేయాలి
విలేకర్లతో మాట్లాడుతున్న నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ కన్వీనర్‌ నాసరయ్యవిలేకర్లతో మాట్లాడుతున్న విలేకర్లతో మాట్లాడుతున్న నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ కన్వీనర్‌ నాసరయ్యనల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ కన్వీనర్‌ నాసరయ్య

- ప్రజలు మరో పోరాటానికి సన్నద్ధం కావాలి

- నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ నేతల పిలుపు


మన్ననూర్‌, జనవరి 28 : నల్లమలలో యురే నియం తవ్వకాలను నిలిపివేయాలని నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ కన్వీనర్‌ కలుముల నాసరయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం అమ్రా బాద్‌లో జేఏసీ నేతలు గంటల గోపాల్‌, బాలకృష్ణ య్య, గోపాల్‌, మోహన్‌, మహ్మద్‌అలీ, మహ్మద్‌జ మీల్‌, గోలి వెంకటయ్య, సి.మల్లయ్య, గోవర్ధన్‌ తది తరులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత, దశాబ్దకాలంగా నల్లమలలో యురేనియం నిల్వలు ఉన్నాయనే కారణంతో అణు ఇంధన శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని, వారి కి అటవీశాఖ అధికారులు దగ్గరుండి సహకరించ డం సరికాదని ఆయన అన్నారు. అణు ఇంధన శాఖ అధికారులు యురేనియం సర్వేను బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా చేస్తున్నారని ఆరో పించారు. నల్లమలలో యురేనియం, ఖనిజ నిక్షే పాలను తవ్వి తీసేందుకు అధికారులు చేస్తున్న ప్ర యత్నాలను విరమించుకోవాలని, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు కూ డా చూసీ చూడనట్టు వ్యవహరించడం వెనక ఆం తర్యమేమిటని ప్రశ్నించారు. యురేనియం తవ్వ కా లు అడ్డుకోవడం కోసం ఈ ప్రాంత ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 



Updated Date - 2022-01-29T05:07:57+05:30 IST