బస్టాండ్‌లో అర్బన్‌ ఎస్పీ ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2021-08-03T06:04:07+05:30 IST

అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ సోమవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్‌లో సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

బస్టాండ్‌లో అర్బన్‌ ఎస్పీ ఆకస్మిక తనిఖీ
ఆర్టీసీ బస్టాండ్‌లో పర్యటిస్తున్న అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పాయింట్ల పరిశీలన

గుంటూరు, ఆగస్టు 2 : అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ సోమవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్‌లో సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌ లోపల ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించారు. అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కార్యాలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బస్టాండ్‌లో పరిస్థితులను ఆర్‌ఎం రాఘవ, సీటీఎం శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. పోలీసు ఔట్‌పోస్టును పరిశీలించి సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.  అనంతరం ఆయన  మార్కెట్‌ సెంటరు, పాతబస్టాండ్‌, ఓల్డ్‌ క్లబ్‌ రోడ్డు, నాజ్‌సెంటరు, ఎంటీబీ సెంటరు తదితర ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్‌ పాయింట్లను, అక్కడ ట్రాఫిక్‌ సమస్యలను పరిశీలించారు.  ఎస్పీ వెంట డీఎస్పీలు రమణకుమార్‌, సీతారామయ్య, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం, పాతగుంటూరు సీఐ వాసు, ఈస్టు ట్రాఫిక్‌ సీఐ వీరానాయక్‌ తదితరులు ఉన్నారు. 

 


Updated Date - 2021-08-03T06:04:07+05:30 IST