ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి మొదటిసారిగా తెలంగాణకు యూరియా

ABN , First Publish Date - 2021-06-15T02:21:00+05:30 IST

జిల్లాలోని రామగుండంలో గల ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి మొదటిసారిగా తెలంగాణకు యూరియాను

ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి మొదటిసారిగా తెలంగాణకు యూరియా

పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో గల ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి మొదటిసారిగా తెలంగాణకు యూరియాను అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి లోడును రైల్వే వ్యాగన్ ద్వారా హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత తీరనుంది. గతంలో మూతబడిన  ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను ప్రధాని మోడీ చొరవ చూపి తిరిగి తెరిపించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి తెలంగాణకే కాక దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు యూరియా సరఫరా కానుంది. ఆయా రాష్ట్రాలలో అన్నదాతలకు యూరియా అందుబాటులోకి రానుంది. 

Updated Date - 2021-06-15T02:21:00+05:30 IST