యూరియాను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు

Published: Tue, 25 Jan 2022 21:13:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
  యూరియాను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు ఎరువుల దుకాణాన్ని పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ ఏవో నాగమోహన్‌రావు

గూడూరు, జనవరి 25:  రైతులకు యూరియాను అధిక ధరకు విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు  తీసుకుంటామని వ్యవసాయశాఖ ఏవో నాగమోహన్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు ఎరువులు, పురుగుమందుల విక్రయ దుకాణాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ దుకాణదా రులు యూరియాను స్టాకు పెట్టుకుని రైతులకు లేదని చెప్పినా, పురుగుమందులు కొంటేనే యూరియా ఇస్తామని తెలిపినా  వారి లైసెన్స్‌లు రద్దుచేస్తామన్నారు. కార్యక్రమం లో వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.