ఎన్‌పీఏలపై ఉర్జిత్‌ పటేల్‌ పుస్తకం

ABN , First Publish Date - 2020-07-06T06:10:01+05:30 IST

ఆర్‌బీఐ మరో మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ కూడా పుస్తక రచనలో పడ్డారు. ‘ఓవర్‌డ్రాఫ్ట్‌. సేవింగ్‌ ది ఇండియన్‌ సేవర్‌’ పేరుతో ఆయన రాసిన పుస్తకం ఈ నెలాఖర్లో మార్కెట్‌లో విడుదల కానుంది...

ఎన్‌పీఏలపై ఉర్జిత్‌ పటేల్‌ పుస్తకం

ముంబై: ఆర్‌బీఐ మరో మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ కూడా పుస్తక రచనలో పడ్డారు. ‘ఓవర్‌డ్రాఫ్ట్‌. సేవింగ్‌ ది ఇండియన్‌ సేవర్‌’ పేరుతో ఆయన రాసిన పుస్తకం ఈ నెలాఖర్లో మార్కెట్‌లో విడుదల కానుంది. ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్‌ కోలిన్స్‌ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. ప్రస్తుతం భారత బ్యాంకింగ్‌ వ్యవస్థకు పెద్ద సమస్యగా మారిన మొండి బకాయిలు, అందుకు కారణాలు, ఆర్‌బీఐ గవర్నర్‌గా వాటి కట్టడికి పటేల్‌ చేసిన కృషి.... ఈ పుస్తకంలో ప్రధాన అంశాలని ప్రచురణ సంస్థ పేర్కొంది. నీతి నియమాలు లేని పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాల నుంచి బ్యాంకుల్లో డిపాజిటర్ల కష్టార్జిత పొదుపు సొమ్మును కాపాడేందుకు పటేల్‌ తీసుకున్న చర్యలనూ ఈ పుస్తకంలో పొందుపరిచారు.


పెద్ద నోట్ల రద్దు సమయంలో ఉర్జిత్‌ పటేల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్నారు. ఆర్‌బీఐ మిగులు నిధులను ప్రభుత్వాని బదిలీ చేసే విషయంలో ప్రభుత్వంతో విభేదాలు తలెత్తడంతో పటేల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవి నుంచి డిసెంబరు, 2018లో అర్థాంతరంగా తప్పుకున్నారు. 


Updated Date - 2020-07-06T06:10:01+05:30 IST