సీఐ సమక్షంలో సారాను విడిచిపెడతామని ప్రమాణం చేస్తున్న గ్రామస్థులు
సీఐ సమక్షంలో సారాను విడిచిపెడతామని ప్రమాణం చేస్తున్న గ్రామస్థులు
జి.మాడుగుల, మార్చి 27: సారా తయారీ, విక్రయాలకు దూరంగా ఉంటామని మండలంలోని ఉర్లమెట్ట గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ ఉర్లమెట్ట గ్రామంలో సారా తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు గుర్తించిన సీఐ సూర్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాసరావు ఆదివారం ఆ గ్రామంలో అవగాహన, చైతన్య సభలను నిర్వహించారు. సారాతో కలిగే నష్టం, కుటుంబాలకు జరిగే కష్టాలను వివరించారు. దీంతో చైతన్యవంతులైన గిరిజనులు ఆదివారం నిర్వహించిన గ్రామ సభలో సారాకు దూరంగా ఉంటామని పోలీసుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ క్రిష్ణమూర్తి, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా పోలీసులు, గ్రామవలంటీర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.