అమెరికాలో పెరిగిన అబార్షన్లు.. ప్రతి ఐదు ప్రెగ్నెన్సీల్లో ఒకటి..

ABN , First Publish Date - 2022-06-16T02:42:57+05:30 IST

అమెరికాలో అబార్షన్ల సంఖ్య పెరిగింది. మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తున్న గుట్‌మేషర్ ఇన్‌స్టిట్యూట్ అనే పరిశోధన సంస్థ ఇటీవల జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అమెరికాలో పెరిగిన అబార్షన్లు.. ప్రతి ఐదు ప్రెగ్నెన్సీల్లో ఒకటి..

ఎన్నారై డెస్క్: అమెరికాలో అబార్షన్ల సంఖ్య పెరిగింది. మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తున్న గుట్‌మేషర్ ఇన్‌స్టిట్యూట్ అనే పరిశోధన సంస్థ ఇటీవల జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ ప్రకారం..  2017లో 8.62 లక్షల అబార్షన్లు జరగ్గా.. 2020లో ఈ సంఖ్య 9.3 లక్షలకు చేరింది. 2020లో గర్భం దాల్చిన ప్రతి ఐదుగురు అమెరికా మహిళల్లో ఒకరు అబార్షన్ చేయించుకున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. అబార్షన్ చేయించుకోవాలా వద్దా అనేది మహిళలకే వదిలేయాన్న వాదనను ఈ గణాంకాలు బలపరుస్తున్నాయని జార్జ్‌ వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. అబార్షన్లకు చట్టబద్ధత కల్పిస్తూ 1973లో అమెరికా సుప్రీం కోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం త్వరలో రద్దు చేయనుందన్న వార్తల నేపథ్యంలో తాజా గణాంకాలు కలకలం రేపుతున్నాయి. 

Updated Date - 2022-06-16T02:42:57+05:30 IST