ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. 50 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇది విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కాదని బైడెన్ హెచ్చరించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులను ధరించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. చాలా మంది అమెరికన్లు వీటన్నిటినీ పాటిస్తున్నారు. అందువల్లే కరోనాపై పోరాటంలో మెరుగైన స్థానానికి చేరుకుంటున్నాం. తొందరలోనే మహమ్మారిపై విజయం సాధించబోతున్నాం’ అని అన్నారు. అంతేకాకుండా తొలి వంద రోజుల్లో 100 మిలియన్ల మందికి వ్యాక్సిన్ను అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సమయంలో చాలా మంది తనను విమర్శించారని ఈ సందర్భంగా బైడెన్ గుర్తు చేశారు. అయితే తాను మాత్రం దీన్ని చిన్న లక్ష్యంగానే భావించానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు 2.84కోట్ల మంది మహమ్మారి బారినపడ్డగా.. 5.08లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు.